మా బావ బంగారం !:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
బావయ్య ఓ బావయ్య
నా బంగారం నీవయ్యా
ప్రేమ ప్రేమ అంటూ నీవు
గోల గోల చేయకయ్య. !
 
         బావయ్య ఓ బావయ్య
         అమ్మ నాన్న ఉన్నారయ్యా
         వారు చూస్తే వచ్చు ముప్పు
         అవునో కాదో నీవే ఇక చెప్పు

బావయ్య ఓ నా బావయ్య బంగారు బాతువే నీవయ్యా
సమయం సందర్భం చూడయ్యా
అప్పటిదాకా నీవింకా ఆగయ్యా !

         బావయ్య ఓ బావయ్య
         నా బంగారం నీవయ్యా
         ఈ సింగారం నీదయ్యా
        చూసి మురిసిపోవయ్యా !

బావయ్య ఓ నా బావయ్య
భలే ఊపుపైన ఉన్నావయ్యా
కాస్తంత తగ్గించుకో నీ జోరు
కన్నవారు చూస్తే కలుగు పోరు !

        బావయ్య ఓ బావ య్యా
        నా బంగారం నీవయ్యా
         ఇప్పుడు వీలు కాదయ్య
         తప్పుకుంటే మంచిదయ్యా !

బావయ్య ఓ నా ముద్దుల బావయ్యా
నా అందం చందం ఇక నీదే నయ్యా
అని నేనెప్పుడో నీకు చెప్పితిగదనయ్యా
మన్నించి నా మాట నీవిక వినవయ్య !

బావయ్యా ఓనా బావయ్యా
నీవేగా మా బంగారమయ్యా
నే చెప్పిన మాట వినవయ్యా
నా మదిలో నీవే ఉన్నావయ్యా !

        అమ్మా నాన్నలకు నే చెప్పి
        వారిని నేను ఇక ఒప్పించి
        ఇద్దరము ఇక ఒకటౌదాము
        ముద్దుగా కలిసిక ఉందాము!


కామెంట్‌లు