దేవుడు దేవుడు దేవుడు
మనం పూజించే ఈ దేవుడు
ఘనమైన మన మహాదేవుడు
మన బొందిలో ఉన్న జీవుడు. !
నిత్యం ఆరాధించే ఈ మనదేవుడు
ముత్యంలా మెరిసే మహిపాలుడు
ప్రభువులకే ప్రభువై యున్నవాడు
త్రి భువనాలను ఏలుతున్న రేడు. !
పూజించి భజించే మన దేవుడు
సేవించి తరించే ఘనాఘనుడు
సర్వాధికారియైన సర్వజ్ఞుడు
నిత్య స్వరూపుడు సత్వజ్ఞుడు !
మనం ఉపాసించే ఈ దేవుడు
మనల ఉద్ధరించే మాధవుడు
ఇనుడై చంద్రశేఖరుడైన జినుడు
పరాత్పరుడైన పరమ పావనుడు !
పై నుండి వీక్షించే ఈ దేవుడు
పంచభూతాలకు ప్రభువైనాడు
ఇహ పర సుఖాల అందిస్తాడు
ఆహరహం సంతోషం కలిగిస్తాడు !
మన పిలుపుకు పలకని దేవుడు
ఘన మలుపులకు ఔను ఆద్యుడు
అని తెలుసుకొని నడుచుకోవాలిక
కని మసులుకుంటే వచ్చు బడలిక!
మా ఇంటి ఇలవేల్పు ఈ దేవుడు
మా కంటి వెలుగు నిల్పు భానుడు
ఆది స్వరూపుడు ఆది పురుషుడు
అగ్నితీయుడైన మా అనంతుడు !
అఖండ తాండవం చేసి ఈ దేవుడు
ప్రఖండుడై ప్రకాశించు ప్రతాపరుద్రుడు
సత్య స్వరూపుడైన సాహసవంతు డు
నిత్య స్వరూపుడైన మా నిరంజనుడు !
ఆకార వికారాలను అధిగమించిన ఈ దేవుడు
ఆనందం కలిగించే మా నిత్యానందుడు
సదానందుడై మాకు కైవల్యం అందించువాడు
మమ్ముల కరుణించి మా ఇంట కొలువైఉన్నాడు !
ఆదిదేవుడై అందరిని ఇలా కరుణిస్తున్నాడు
పాప కూపం నుండి మనల తొలగిస్తున్నాడు
అట్టి ఆదిదేవుని అందరం తలుచుకుందాం
మన మదిలోన ఆ పురుషుని నిలుపుకుందాం !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి