బడుగుల బాధలు, గాథలు :- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
బ్రతుకు 3
బాధల గాథల బ్రతుకు
చీకటి తప్పా వెలుగే లేని బ్రతుకు

దినదినగండం నూరేళ్లాయిష్షూ
అవసరాలే తీరని అరకొర వేతనం
నిత్యదారిద్ర్యం నిరాశ నిస్పృహయే మాకు బహుమానం 

ప్రాథమిక అవసరాలే
తీరని 
జీవశ్ఛవపు బ్రతుకులు మావి 
బానిసత్వం జ్ఞానలేమే వెనుకబాటుకు  మూలమని
తెలుసుకోలేని బడుగు జీవులం మేము

మోమున చిరునవ్వు లేదు
అను నిత్యం దైన్యం
అడుగడుగునా అవమానం
పుట్టుకే శాపమైన బ్రతుకులు మావి 
పోరాడలేక అలసిపోయిన దేహాలు మావి
చావు కెదురు చూస్తూ బ్రతుకెళ్ళదీస్తున్న బడుగులం మేము

నిశ్శబ్దం అలుముకుంది
మా బ్రతుకుల్లో
ఆశారేఖ ఉందో లేదో బ్రతుకు మలుపులో
చివరికి మరణమే శరణ్యమా?!
బ్రతికి బట్టకడతామా?!
మీ తోటివారుగా మమ్మల్ని చూడని సంఘాన
మేము ఏకాకులం
మా హృదిలో
మా మదిలో 
ఆశలేనోళ్ళం
కడుపాకలి తీర్చే సంఘానికి
ఋణపడి ఉండేటోళ్ళం
ఎటువంటి జబ్బులేనోళ్ళం
పని పాట చూపితే బ్రతుకెళ్ళదీసెటోళ్ళం
ఏ ఆదెరువులేని నాడు బలవన్మరణమే మాకు శరణ్యం


కామెంట్‌లు