బాల్యం తిరిగి రానిది :- అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగామ-9640748497
బాలలకు దేశభక్తి 
దైవభక్తి
స్వాభిమానం
కన్న తల్లిదండ్రులు
ఉన్న ఊరు
కలిసిమెలిసి తిరిగిన సహవాసగాళ్ళు
వీరి సత్సాంగత్యాన్ని
మీ బిడ్డలకు
జీవితపర్యంతం గుర్తుంచుకోవాలని
ఇళ్ళలోతల్లిదండ్రులు 
గురువులు పాఠశాలల్లో 
బాలలకు ఉద్భోదించాలి

నేడు 
ఐఐటీ ఫౌండేషన్ స్కూల్స్
ఒలింపియాడ్ స్కూల్స్
ఇంటర్నేషనల్ స్కూల్స్
పేరునా
కొని చదివే విద్యాకేంద్రాల్లో
పసితనం నుండే కెరీర్ గైడెన్స్
ఇస్తూ
బండెడు బండెడు పుస్తకాలబరువులు
చిన్ని మెదళ్ళు తట్టుకోలేనంత
హోమ్ వర్కులు

ఇవి వారి స్వేచ్ఛకు అవరోధాలు

ఎగిరే చిట్టిచిలకమ్మలను
చదువుల పంజరాన బంధీచేసిన
ధనవ్యామోహపు
తల్లిదండ్రుల స్వార్థ బుద్ధి
 
అటుపై 
ఒంటరితనం
సృజనాత్మకత లోపించిన బిడ్డలు
మనోవ్యాధిగ్రస్థులై
కుదేలవుతున్నరేపటితరం

ఇకనైనా మనం మారుదాం
బాల్యం తిరిగి రానిది
బాల్యం బాలల హక్కు
దానిని వారు తనివితీరా ఆస్వాదించేలా చూద్దాం
ఆటలాడనిద్దాం
వారికి నచ్చినట్టు పాటపాడనిద్దాం
స్వేచ్ఛా విహంగంగా ఎగరనిద్దాం
(బాలల దినోత్సవం సందర్భంగా ...  )
-


కామెంట్‌లు