వృక్షోక్షతిరక్షితః:- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
చెట్లు భూమికి ఊపిరితిత్తులు 
చెట్లు ప్రగతికి మెట్లు
చెట్లు జగతికి పనిముట్లు
చెట్లుంటే క్షేమం లేకుంటే క్షామం
చెట్లు లేని లోకంలో మానవమనుగడే దుర్లభం
చెట్లు ప్రాణవాయువును అందించి
సమస్త జీవుల జీవన ప్రమాణస్థాయిని పెంచేవి, నిర్ధారించేవి.
చెట్లు నీడనిచ్చి,గూడు నిచ్చి 
పువ్వులు పండ్లనిచ్చేవి
ఔషధీ గుణములు గలవి

కలపతో  వ్యాపారంచేసే అక్రమార్కులు
చెట్లను తెగనరికి సొమ్ము చేసుకుంటున్నారు

చెట్లు లేనినాడు మన బ్రతుకులన్నీ ఎండమావులే
చెట్లు లేని నాడు గాలిలేదు గాలిలేకుంటే మేఘాలనాకర్షించలేము
 ఇక వర్షాలేఉండవు

వర్షాలు లేకుంటే పంటపొలాలన్నీ
బీళ్ళుగా మారుతాయి

వ్యవసాయానికి అవసరమైన,
పాడికి పశుసంపదకు గ్రాసంకరువై , వాటిని 
 సంతల్లో కారుచౌకగా తెగనమ్ముకుంటారు

బక్కచిక్కిన పశువులను కబేళాలకు తరలిస్తుంటారు 
అందుకే సకలమానవకోటి
విరివిగా మొక్కలు నాటాలి,
వాటిని సంరక్షించాలి.

భూమ్మీద కాంక్రీటు మైదానాలు
తగ్గించాలి.
చెట్లుంటేనే భూగర్భ జలాలు
పెరుగుతాయి.
భూతాపం తగ్గుతుంది.
వాతావరణం కాలుష్యరహితంగా ఉంటుంది.
అందుకే అంటారు
వృక్షోరక్షతి రక్షితః
చెట్లను మనం కాపాడుకుంటే
ఆ చెట్లు మనల్ని కాపాడుతాయి
అందుకే 
 ఇంటింటా చెట్టు ఊరంతావనం.

వనప్రేమి సుందర్ లాల్ బహుగుణ
స్ఫూర్తితో

చిప్కోఉద్యమాన్ని
దేశమంతా అమలుచేద్దాం.
చెట్టును  నరకకండి
నన్ను నరకండి
అంటూ చెట్లను ఆలింగనం చేసుకుందాం.
వనముంటేనే జనముంటుంది.
జనముంటేనే జగముంటుంది.
జగముంటేనే ప్రగతుంటుంది.

కామెంట్‌లు