మేమే2 పిల్లలం
భవిష్యత్తుకు ఆశాజ్యోతులం
సూర్యకిరణాల తళతళలం
చకచక మెరిసే తారకలం
లేగదూడ గెంతులం
సెలయేటి నడకలం
పిట్టల కిలకిలరావాలం
కురిసే వాన జల్లులం
స్వచ్ఛమైన మనసులం
అమ్మపాటకు పరవశిస్తాం
నాన్న ప్రేమకుసంతోషిస్తాం
చాచా కథలు వింటుంటాం
నెహ్రూలా తయారవుతుంటాం
మేఘంలా బిరబిరా ఉరికేస్తాం
మాటలు గలగల మాట్లాడేస్తాం
చెట్లను చకచకనాటేస్తాం
పర్యావరణాన్ని రక్షిస్తాం
మేము హరితహారవీరులం
నిష్కపట హృదయాలం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి