ఎప్పటికైనా తప్పు తప్పే :- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
తెలిసి తప్పుచేస్తారా
అధికారం ఉంది కదా అని
అమ్యామ్యాలకు పాల్పడతారా
ఎంతో పేదరికం అణిచివేత
నుండి రేయనకపగలక కష్టపడి ఉద్యోగం సంపాదించిన మీరు 
నీతిమంతులుగా
నిలబడతారనుకుంటే
ఉద్యోగులుగా మీరు 
ప్రభుత్వానికి, ప్రజలకు
జవాబుదారీగా ఉండక
పాలకుల అడుగులకు
మడుగులొత్తుతారా
అభాగ్యులు అవసరార్థం
వారి హక్కుగామిమ్మల్ని 
 అడిగితే బాధ్యత మరిచిన మీరు 

తడితగలనిదే
ఫైలుకదలదని
ముఖంమీద చెప్పేస్తారా!?
నెలనెలా వచ్చే జీతం రాళ్ళు సరిపోవట్లేదా!?
జీతం కంటే గీతం మీదే
ఎక్కువ యావ పెంచుకుంటారా!?
ఉద్యోగం నీ అర్హతను బట్టిరావొచ్చు
కానీ
ప్రజాస్వామ్యంలో ప్రతి ఉద్యోగి ప్రజాసేవకుడే అన్న విషయం మరచి ప్రవర్తిస్తున్నా(రు)వు
ఏయేపనికీ ఎంతెంత రేటు నిర్ణయించావు
ఎంతెనకేసినావు
నువ్వు ఉద్యోగంలోకి వచ్చినప్పుడు నీ ఆర్థిక స్థితి ఏంటీ
నీ  సామాజిక నేపథ్యం ఏంటి 
అంతా
లెక్క కడతారు
ఓరి అవినీతి కోరు అధికారి
తిన్న ప్రతీరూపాయి కక్కిస్తారు
ప్రజాస్వామ్యం అంటే ప్రజలచేత ప్రజలకొరకు
ఏర్పడిన వ్యవస్థనే ప్రజాస్వామ్యం 
అని అంటారు 
ఇక్కడ ప్రజలే ప్రభువులు
ఇక్కడ ప్రజలే శాశ్వతం
ఉద్యోగులు ప్రభుత్వానికి
ప్రజలకు జవాబుదారులు ,
సేవకులు మాత్రమే 
తస్మాత్ జాగ్రత్త
అవినీతికి పాల్పడితే
కటకటాల వెనక్కి తోస్తారు
అభాగ్యులకు అవసరార్థులకు
అండదండగుంటే మిమ్మల్ని ఈప్రజలే(మేము)
వేనోళ్ళ కొనియాడుతారు


కామెంట్‌లు