చదువో యజ్ఞంలా
కొనసాగిస్తున్నమీరు
రేపటి దేశ భవిష్యత్తు
మీకు అరకొర వసతులుంటేనేమి
చదవాలనే జిజ్ఞాస ఉండాలి
కానీ
చదివే స్థలం పఠనాలయమా!
పంటపొలమా?
పశువుల పాకనా?
ఏదైతేనేం?
అసమర్థుడే
రీడింగ్ రూం కావాలంటాడు
సమర్థుడికెలాంటి పట్టింపులుండవు
మస్తకాలను వెలిగించే
పుస్తకాలు
ఆసాంతం చదవండి
అందులో అనుభవజ్ఞుల
అనుభవసారమే పాఠమై నీతిప్రబోధాత్మమైనగేయమైనది
రేపది బ్రతుక్కో తొవ్వజూపే దీపమౌతది
చదువు ఇప్పుడు తలవంచి చదువు
రేపు తల ఎత్తుకొని బ్రతుకు
పుస్తకం హస్తభూషణం
పుస్తకం మస్తకభూషణం
అందుకే అన్నారు శతకకర్తలు చదువును
దొంగలెత్తుకపోరు
పదుగురికి పంచినపెరిగేధనం
ఈ విద్యాధనం
అన్నదమ్ములు పంచుకోలేరు
చదువుకున్న వారిని రాజుకూడా అతని తెలివితేటలను గుర్తెరిగి
గౌరవిస్తాడు
ఎంతో నిష్ఠతో, నిబద్ధతతో చదువుకుంటున్న బాలలు
మీరే మీరే భావిభారత పౌరులు
చదవండి వ్రాయండి
వ్రాయండి చదవండి
వచ్చేదాకా చదవండి
చచ్చే దాకా చదవండి
చదివి చదివి మీలోని అజ్ఞానాన్ని దూరం చేసుకోండి
జ్ఞానజ్యోతిని వెల్గించండి
అది నూతనావిష్కరణలకు నాందవుతుంది
అది దేశాన్ని తేజోమయంచేస్తుంది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి