స్త్రీతోనే జగతి ప్రగతి:- -గద్వాల సోమన్న,9966414580
కుటుంబంలో పడతి
లేకపోతే వెలితి
భువిలో అసమానము
ఆమె సేవానిరతి

వనిత లేని సదనము
శిథిలమైన భవనము
చూడ అంధకారము
అగును కళావిహీనము

ఇంటి దీపము నాతి
తెచ్చిపెట్టును ఖ్యాతి
ఆమె లేని లోకము
అనుభవించు శోకము

స్త్రీలను గౌరవించు
దైవము సంతసించు
ఆమెతోనే జగతి
జరుగుతుందోయ్! ప్రగతి


కామెంట్‌లు