చాచా నెహ్రూ పుట్టినరోజు:- -గద్వాల సోమన్న,9966414580
చాచా నెహ్రూ పుట్టినరోజు
బాలలందరికి పండుగ రోజు
అదే అదే  బాలల దినోత్సవం
సమతమమత విరబూసిన రోజు

నెహ్రూకు ఇష్టమైన రోజు
చిన్నారులతో గడిపే రోజు
పిల్లల సంబరం అంబరం
ముద్దాడే ఘనమైన రోజు

పిల్లల నవ్వులు విరిసిన పువ్వులు
నెహ్రూజీకి దొరికే రోజు
పెద్ద వారితో పిన్నలకు
చెలిమి కలిమి కుదిరిన రోజు

పసి మనసుల్లో చాచాజీ
పొదరిల్లు కట్టుకున్న రోజు
నవంబర్ పదనాలుగవ తేది
బాలల పండుగ అయిన రోజు


కామెంట్‌లు