శ్రేష్టమైనది స్నేహము:- -గద్వాల సోమన్న,-9966414580
వాడిపోయేది పుష్పము
రాలిపోయేది పత్రము
చెరిగిపోయేది స్వప్నము
చెక్కు చెదరనది స్నేహము

జుంటితేనెలా మధురము
జాబిలమ్మలా అందము
అతిపవిత్రమైన బంధము
శ్రేష్టమైనది స్నేహము

వెన్నెలంత చల్లదనము
వెన్న వోలె మెత్తదనము
మల్లె రీతి తెల్లదనము
సాటిలేనిది  స్నేహము

ప్రేమకది కేంద్ర బిందువు
నిజముగా ఆత్మబంధువు
అనిర్వచనీయమైన 
చూడ అనురాగ సింధువు

కనురెప్పలా కాయునది
గుండెలా పని చేయునది
భగవంతుని బహుమానము
భువిలోనే అసమానము

చేయకు ఎన్నడు ద్రోహము
అది క్షమించరాని నేరము
మిత్ర భేదము ఘోరము
ఉండుము దానికి దూరము


కామెంట్‌లు