తాతయ్య కాంక్ష;- -గద్వాల సోమన్న,9966414580
పోవాలి పోవాలి
మనసులో భేదాలు
పుట్టాలి పుట్టాలి
ప్రేమానురాగాలు

మారాలి మారాలి
శిల వంటి హృదయాలు
కావాలి కావాలి
సరికొత్త భవనాలు

కోరాలి కోరాలి
జనుల సంక్షేమాలు
కదలాలి కదలాలి
ప్రగతి రథ చక్రాలు

వేయాలి వేయాలి
ముందడుగు వేయాలి
చేరాలి చేరాలి
ఇల విజయ తీరాలు

మానాలి మానాలి
పగ ప్రతీకారాలు
పూయాలి పూయాలి
క్షమ,జాలి సుగుణాలు

వదలాలి వదలాలి
మూఢవిశ్వాసాలు
పెరగాలి పెరగాలి
కొండంత భావాలు

కలపాలి కలపాలి
చెదిరిన కుటుంబాలు
చేయాలి చేయాలి
మానవ ప్రయత్నాలు

రావాలి రావాలి
ఆదర్శ పాలకులు
జరగాలి జరగాలి
ప్రజకు సమ న్యాయాలు


కామెంట్‌లు