వాస్తవాల వెలుగులు:- -గద్వాల సోమన్న,9966414580
సూర్యుడు మొరాయిస్తే
జగతి అంధకారము
బద్ధకము ఆవరిస్తే
ప్రగతి గగన కుసుమము

ప్రేమపూలు వాడితే
బంధాలు మటుమాయము
క్షమాగుణం కొరవడితే
రాజ్యమేలు శత్రుత్వము

ఇంట స్త్రీ లేకపోతే
ఒంటరి ఇక జీవితము
కొంటె పనులు మానితే
వెంట వచ్చు గౌరవము

అహం గనుక హెచ్చితే
తప్పదోయి! అవమానము
జనం గనుక మెచ్చితే
దక్కునోయి! సన్మానము

దుర్గుణాలు వీడితే
బాగుపడును జీవితము
వ్యసనాలు జయిస్తే
ఎక్కవచ్చు అందలము

విశ్వశాంతి కోరితే
ఇక వసుధైక కుటుంబము
తేడాలు సమసిపోతే
ఏర్పుడును సమ సమాజము


కామెంట్‌లు