శ్లో: వక్షస్తాడనశంకయా విచలితో వైవస్వతో నిర్జరా
కోటీరోజ్వల రత్నదీపకలికా నీరాజనం కుర్వతే
దృష్ట్వా ముక్తి వధూస్తనోతి నిభృతాశ్లేషం
భవానీపతే యచ్చేతస్తవ పాదపద్మ భజనం తస్యేహ
కిం దుర్లభమ్ !!
భావం! ఓ భవానీ పతీ ! ఎవడి మనసు నీ పాద పద్మములను సేవించునో వానిని చూచి యముడు, నీవు కాలుతో తన్నెదవనే భయంతో పారిపోవుచున్నాడు. దేవతలు తమ కిరీటములందలి రత్నములనే దీపములతో నీరాజనమిచ్చుచున్నారు. ముక్తి అను స్త్రీ అతనిని గట్టిగా కౌగిలించుకొనుచున్నది. అతనికి దుర్లభమైనది ఏమున్నది.
*****
శివానందలహరి:-కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి