శ్లో:! నిత్యం స్వోదరపోషణాయ సకల నుద్ధిశ్య విత్త్మాశయ
వ్యర్థం పర్యటనం కరోమి భవత స్సేవాం న జానే విభో
మజ్జన్మాంతరపుణ్యపాకబలతస్త్వం శర్వ సర్వాంతర
స్తిష్టస్యేవహితేనవా , పశుపతే తే రక్షణియోస్మ్యహమ్ !!!
భావం: శివా! ఓ పశుపతీ ! ప్రతి దినము నా ఉదర పోషణకు ధనము ఆర్జించుటకు కలవారి గురించి అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. కానీ నిన్ను సేవించుట ఎరుగను. కానీ నా పూర్వ జన్మ పుణ్యఫలమున సర్వాంతర్యామివి అయిన నీవు నాలోను ఉన్నావు కదా! అందు చేత అయిననూ
నన్ను ఉపేక్షించకుండా రక్షింపదగిన వాడనే కదా !!
*****
శివానందలహరి:- కొప్పరపు తాయారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి