క్షరము కానిదే అక్షరము
అక్షర కిరణాస్త్రంతో
క్షరమయ్యే నిరక్షరాస్యతా
రక్కసిని దునుమాడుదాం
అక్షరం ఒక తోడు
అక్షరం ఒక జోడు
ఒక్కసారి నేర్చిచూడు
జీవితాంతం నీ చెలికాడు
తరతమ భేదాలు మరిచి
కలిసిమెలిసి మనమంతా
అక్షర కటి బద్ధులమై
భరతమాత మెడలో
అక్షరమాలను అలంకరిద్దాం
అక్షరాలతో హారతినిద్దాం!!
**************************************
అలంకరిద్దాం:- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి