ఆయుధం ....!!: --డా.కె.ఎల్.వి.ప్రసాద్.

 పట్టిన పట్టువదలడు 
ఏడుపును -
ఆయుధముగా ఎంచి ,
అనుకున్నది సాధించగలడు,
సాధించి ఆనందించగలడు!
నవ్వగలడు....
నవ్వుతూ నవ్వించగలడు!
తనదంటూ ఒకభాషతో 
సంజ్ఞలకు ఆపాదించి...
అనుకున్నది చెప్పగలడు!
అసలుభాష -
అర్ధం చేసుకోగలడు....
చెప్పింది చేయగలడు!
నా ముద్దుల మనుమడు
నికో..అనబడు....
నివిన్ అయాంశ్.నల్లి!!
              ***
కామెంట్‌లు