గిరిధర గోపాలా....ఈ మీరా మొర వినలేవా....!
నేను పుట్టింది నీ కొరకే...నా ఈ జన్మ నీకే అంకితం..!
నీ నామ స్మరణయే...నే రూప ధ్యాసయే....నాకు ఆహార,పానీయాలు ...!
నీవు నా తలపులలో ఎన్నెన్ని ఊసు లాడలేదు ...,ఎన్నెన్ని బాసలు చేయలేదు...!!
నీ నామొచ్చారణయే మధురం ! నీ రూప లావణ్య భావ దర్శనమే ,మధురాతి మధురం..!!
నీవు నాతో అనునిత్యం ఎన్ని ఊసులాడుతున్నావు....
ఇది చాలదా ఈ జన్మకు !
మన కలయికను,అందులోని అనుభూతులను ,ఆ ఆనందాలను ఎన్నెన్ని కీర్తనలలో పొందు పరిచాను !
నా భక్తిని ,ప్రేమను ,అనురాగాన్ని ,ఆనందాన్ని ...ఈ కీర్తనలలోనే దాచుకుంటున్నాను ..!
ఇది చాలులే ఈజన్మకు ...ఏ కన్మకూ నీవే నా సఖుడవు...ప్రియుడవు...
నా భర్తవూ నీవే....
ఎవరేమనుకుంటే నాకేం...!!
నేను పిచ్చిదాన ననుకుంటుంది ఈ లోకం ...నేను అనుక్షణం నీతోనే ఉంటున్నా నని ,నా ఊసులు , బాసలు, అన్నీ నీతోనే నని ఈ వెర్రి జనాలకెలా తెలుస్తుంది ....!
జయ గోవింద భజే... జయగోపాల హరే...జయ గోవింద, జయాగోపాల జయ నంద లాల జయే....
👏👏👏👏👏👏.
గిరిధర గోపాలా: -... కోరాడ నరసింహా రావు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి