తెలుసుకుందాం! సేకరణ :-అచ్యుతుని రాజ్యశ్రీ

 పురాణ పురుషుల ధ్వజాలపై చిహ్నాలుండేవి.శ్రీకృష్ణుడు గరుడధ్వజుడు.ధర్మరాజు   ధ్వజం పై  చంద్రధ్వజుడుఅర్జునుడి కేతనంపై కపిరాజు దుర్యోధనుని కేతనంపై పాము కర్ణుని జెండా పై ఏనుగు
 రావణుని ధ్వజం పై మనిషితల ఇంద్రజిత్తు జెండా పై సింహం చిత్రాలుండేవి.అయోధ్యని నిర్మించినవాడు వైవస్వతమనువు. ఆయన భార్య శ్రద్ధ.గురువు వశిష్ఠుడు. యజ్ఞంచేయాలంటే నది ఉండితీరాలి.రాజు తన బాణానికి సంధించివిడిచాడు. అది మానససరోవరం చేరి నదిని అయోధ్య కు తెచ్చింది.అందుకే ఆనదికి శరయూ  సరయు అనిపేర్లు. 
మనం నిమిషం గంటలు లెక్కిస్తాం. ఇక్ష్వాకుమహారాజుకి వందమంది కొడుకులు.మూడోవాడు నిమి. ఊరికే యాగాలు విరామం లేకుండ చేస్తుంటే వశిష్ఠుడు కులగురువుగా హెచ్చరించాడు"రాజ్యపాలనపై దృష్టిపెట్టమని". వేరే పురోహితునితో యాగంచేయించుకుంటానని నిమి అనటంతో కోపంవచ్చి" నీవు విదేహుడివి అవుగాక " అని శపించటంతో దేహంలేనివాడైనాడు.జీవుల కనురెప్ప పాటులో కాలంగడిపే నిమి పేరుతో నిముషం అనేపదం వాడుక లోకి వచ్చింది.దేవతలు అనిమిషులు.హణ్వుడనే మహర్షి హిమాలయాల్లో తపస్సు చేశాడు.ఆయనపై పుట్టి పెరిగింది.వెదురు మొక్క మొలిచి పెద్ద గా ఎదిగింది.బ్రహ్మ దానితో రెండు ధనుస్సు లు తయారు చేసి విష్ణువుకి శివునికి బహూకరించాడు.తను గాండీవం ని తీసుకున్నాడు.ధనుస్సుకి పినాకం అని పేరు.అలా శివునికి పినాకపాణి అనిపేరు వచ్చింది🌹
కామెంట్‌లు