ఆమె
రంభ ఊర్వశి మేనక అప్సరస కాదు.దక్షయజ్ఞంలో సతీదేవి దగ్ధమైపోతుంది. ఆమె మేనక హిమవంతుల కూతురుగా పుట్టినందున హైమవతి అనే పేరుకూడా ఉంది.హిమవంతుని కూతురుగా అమ్మవారు పుట్టి పార్వతిగా శివుని పెళ్లాడింది. తల్లి మేనకను గూర్చి తెల్సుకుందాం.స్వధ దక్షుడు అనే దంపతులకు ముగ్గురు కూతుళ్లు.వారు మేనక ధన్య కళావతి.ఈముగ్గురు అమ్మాయిలు వైకుంఠానికివెళ్లారు. సనకసనందాదులు వస్తే వీరు లేచి నిలబడలేదు నమస్కరించలేదు. వారు శపించారు భూలోకంలో పుట్టమని. విష్ణువు అంశతో మేనక హన్మంతు కూతురుగా పుట్టింది.నల్లగా ఉందని కాళీ అనిపేరుపెట్టారు. పర్వత రాజపుత్రిక కాబట్టి పార్వతి అన్న పేరు వచ్చింది.మేనక చెల్లి ధన్య జనకుడి భార్య సీతాదేవి తల్లి.కళావతి వృషభానులకు రాధాదేవి పుడ్తుంది.గోలోకానికి వెల్తుంది. మేనక అమ్మ వారిపూజలుచేసి 100మంది కొడుకులు ఒక కూతురు కావాలంది. అలా పార్వతి పుట్టి శివుని పెళ్లాడింది.మేనకాదేవి జన్మ ధన్యమైంది కదూ?!🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి