సుప్రభాత కవిత : - బృంద
జగాల కాచి రక్షించే 
యుగాలనాటి దైవానికి 
పదారుకళలతో వెలిగే 
ఇలాతలపు ఇంపైన 
స్వాగతం!

మరకతాలు పొదిగిన 
మణిహారములు ధరించి 
ముకుళిత హస్తాలతో 
ముదముతో భువి పలుకు 
స్వాగతం

కాంచన రేఖలతో 
కాంతులు చిందిస్తూ 
కరిమబ్బుల తప్పిస్తూ 
కురిపించు కరుణకు 
స్వాగతం

కవాతు చేస్తున్న 
సిపాయి దండుల్లా 
వరుసగా నిలుచున్న 
తరువులు చేసే ఆత్మీయ 
స్వాగతం

ఆప్తుడి ఆగమనపు 
అపురూప సమయాన 
అవని ఆణువణువు పలుకు 
అనురాగ రాగాల
స్వాగతం

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు