పరమాత్మ ఒక్కడే కానీ ఎవరిచిత్తం వచ్చినట్లు వారు పిలుస్తారు కొలుస్తారు.గంగ అంటే జ్ఞానం.రామేశ్వరంలో రామేశ్వర లింగం గూర్చి కొందరు ఇలా వాదోపవాదాలు చేశారు.ఈపేరు ఏసమాసం?" అని ఎవరో అడిగారు.దానికి జవాబు" రాముని యొక్క శివుడు.. షష్ఠీ తత్పురుష సమాసం " ఒకడికి ఇది నచ్చక"రాముడే ఈశ్వరుడిని కల్గిన వాడు..బహువ్రీహి సమాసం" అన్నాడు.రాముడ్ని ఈశ్వరునిగా కల్గిన వాడు బహువ్రీహి అని కైలాసం లో వారు అన్నారు."రాముని యొక్క ఈశ్వరుడు షష్ఠి తత్పురుష సమాసం అని విష్ణు లోకం వాసులు అన్నారు.ఏతావాతా చెప్పేదేమిటంటే రాముడేశివుడైనాడు శివుడే రాముడైనాడు.
2కంచిలో వెయ్యి శివాలయాలున్నాయికానీ ఒకేఒక
కంచి కామాక్షి అమ్మవారి ఆలయం ఉంది.కులమతప్రసక్తిలేకుండా ఏఊరేగింపైనా ఆగుడిచుట్టూ తిరిగి పోవాలి.ఇకచిదంబరంలో నటరాజ స్వామి కనకసభలో ఉంటాడు.మారేడుదళాలమాల దైవం కి ఎలా అర్పిస్తారోతెలుసా? గోడమీద వేస్తారంతే! శివలింగం కన్పడదు.అదేశివుడు.అందుకే చిదంబర రహస్యం అంటారు.ఆకాశంలో అంతటా ఉన్నాడు.నటరాజస్వామి కాళికాదేవి నాట్యంలో పోటీ పడ్తారు. ఇద్దరూ సమ ఉజ్జీలుగా ఉన్నారు.శివుడు పళ్లెంలో కుంకంని తన కాలి వేలితో తీసి కాలు ఎత్తి లాస్యం చేస్తున్న ఆమె నుదుట దిద్దాడు.ఆమె అంతా చొరవగా కాలు పైకి ఎత్తలేక ఓటమి అంగీకరించింది.ఇక కాళహస్తి లో లింగం పశ్చిమ దిక్కున ఉంటుంది.రెండుదీపాలు సదా ఆరిపోకుండా వెలుగు తూనే ఉంటాయి.ఆక్సిజన్ లేకుండా దీపంలా వెలుగుతుంది అని పరీక్ష చేసిన ఆంగ్లేయులు తెల్ల బోయారు.
3దారుకి దారుకుడు అని రాక్షస దంపతులు మహా విచిత్ర స్వభావం కలవారు.నరకాసురుడు మునులగడ్డాలు ముడివేసి ఊయలలూగేవాడు.ఈదంపతులు చావటానికి సిద్ధంగా ఉన్న వారిని చంపకుండా హింసించి బాధపెట్టే వారు.ఒకసారి ఈదంపతులు ఔరుమడు అనే మునిని శరణువేడారు.వారు కామరూపులైసంచరించేవారు.సముద్రంలో జీవులని పడవప్రయాణీకులను నానారకాలుగా హింసించే వారు.ఓడలోని వ్యాపారిని దోచేసి బంధించారు.అతడు ఈశ్వరేచ్ఛ అంటూ పార్ధివలింగంనిపూజించసాగాడు బందీఖానాలో ఉన్న మట్టితో! దారు కి పార్వతి ని ఆరాధన చేసి మెప్పు పొందింది.ఈకథవల్ల మనకి ఏంతెలుస్తుందంటే పూర్వజన్మలో చేసిన సంపాదించిన పుణ్యమే నేడు వారు రాక్షసులు గా ఉన్నా పెత్తనం చలాయించగలరు.చెడుపనులతో వారి పుణ్యం తగ్గి
ఎన్నో బాధలు పడతారు.అందుకే ఇప్పుడు మనం చూస్తున్నాంకదా దుర్మార్గుల ఆగడాలు! ఐనా సుఖభోగాల్లో తేలియాడ్తున్నారు కదా??
4.గుశ్మేశ్వరుడు అనేపేరు తో శివుడు బావిలో వెలిశాడు.దీనికోకథ ఉంది. సుదేహకి పిల్లలు పుట్టలేదు.పిల్లలకోసం రెండో పెళ్ళి చేసుకోమని భర్తని పోరుతుంది." నీకు సవతి వస్తే ఆమెకు పిల్లలు పుడితే భరించలేవు సహించలేవు" అని భర్త ఎంత నచ్చజెప్పినా మొండి కేసింది.ఇక చేసేదేమీ లేక ఆమె చెల్లెలు గుప్పుమని పెళ్లి చేసుకున్నాడు.చెల్లి తనకు సవతిగా వచ్చినా బాధపడలేదు సుదేహ.గుశ్మపరమశివభక్తురాలు.ఆమెరోజూ101 పార్థివ లింగాలని పూజించి బావిలో కలిపేది.ఆమెకు కొడుకు పుట్టాడు.వాడిని సుదేహ ప్రేమ గా పెంచి పెద్ద చేసింది.పెళ్ళి కూడా ఐంది.వియ్యాలవారు గుశ్మని వియ్యపురాలుగా గౌరవించి సుదేహను ఛీత్కరిస్తారు.
అంతే సుదేహలో అసూయ కచ్చ అమాంతం పెరిగిపోయింది.పెళ్ళయినరాత్రి పదేళ్ల కోడలు కొడుకు నిద్ర పోతున్న వేళ సుదేహ పిల్లాడిని కత్తితో ముక్కలు
ముక్కలుగా నరికి బావిలో పడేస్తుంది.చిన్నారి కోడలు తెల్లారి రక్తంలోని చూసి భయంతో ఏడుస్తూ ఉంటే కల్లబొల్లి మొసలి కన్నీరు కార్చింది సుదేహ.
గుశ్మ శివుని ప్రార్థించి ఆలింగాల్ని బావిలో పడేసేటప్పుడు కొడుకు శరీరభాగాలు చూసి "శివా! నాకొడుకు ని పూజా పుష్పంగా మార్చి నీ పాదాల చెంతకు చేర్చావా?" అని అంటే భక్తవశంకరుడు ఆమె మాటలకు తట్టుకోలేక త్రిశూలం తో " నీ అక్క పాపాత్మురాలు.ఆమెని చంపేస్తా" అని అంటే" శంకరా! నాకొడుకు ని బ్రతికించు" అనటం పిల్లాడు
సజీవుడుకావటం " నా అక్క వల్లనే నీ దర్శనం ఐందిస్వామీ" ఆన్న గుశ్మ భక్తి కి మెచ్చి జ్యోతిర్లింగంగా వెలిశాడు గుశ్మేశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు .

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి