అపురూపం ఈ బహుమానం
అరుదుగా దొరికే జీవనం
అలవర్చుకుంటే మంచితనం
జీవితం నిత్య నూతనం
దైవమిచ్చిన జన్మలో
ప్రాప్తించిన దేహానికి
దొరికిన ఆరోగ్యం
బంగారు కానుకే!
మనిషికి ఊపిరిగా
మమతే బాసటగా
మనసుకు పండగలా
దొరికే ప్రేమ కాదా వరం
మరే జీవికి లేని మరో
అద్భుతవరం మనసే!
దాని రక్షణకు అవసరం
ఆలోచన విచక్షణ!
అమూల్యమైన జీవితం
అఖండమైన ఆరోగ్యం
అపురూపమైన మనసు
అంతరాయం లేని ప్రేమ
అందని వాటికై అర్రులు చాచక
అందినవే వరాలనుకుని
అంతరంగం నిర్మలమైతే
ఆనందమే అందే ఫలం కాదా!
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి