పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వరర్యాయ మృత్యుంజయస్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణసపర్యాలోక నాకర్ణ లేజిహ్వా చిత్త కిరోంఘ్రిహస్త నయనశ్రోత్రై రహం ప్రార్థితోమా మాజ్ఞాపయ తన్నిరూప యముహు ర్మామేవ మామేవచః !!భావం:ఓ మృత్యంజయా ఓఈశ్వరా! పాపముల నుండి విముక్తి పొందుటకు, కావాలసిన ఐశ్వర్యమును ఉండుటకు ఈశ్వరుని ధ్యానింపుమని మనస్సు, స్తుతించమని నాలుక యూ, నమస్కరించమని కరములు, నిన్ను చూడమని కన్నులు, నీ కథలు వినమని చెవులు, నన్ను పదేపదే కోరుతున్నవి. నా అవయవములు నన్ను కోరిన విధముగా చేయుటకు అనుమతిని ఇమ్ము. నాకు ఎటువంటి ఆటంకములు రాకుండా నీవే చూడుము.******
శివానందలహరి;- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి