నడవాలి ..నడవాలి ...
నడవాలి ..నిత్యం
నడవగలిగినంతదూరం ...
నడుచుకుంటూపోవాలి ...
అదే ..స్పూర్తితో తిరిగి
వెనక్కు నడిచిరావాలి !
నడకలోని గొప్పదనం
నడకవల్ల పొందే మేలు
ఇప్పుడే తెలవదుకన్నా !
నువ్వుఎదిగినప్పుడు
అది తెలిసివస్తుంది నాన్నా !
ఇప్పుడునీకది
ఆటల్లో ..ఒకఆట ....
భవిశ్యత్తులో ఈ నడక
ఆరోగ్యాన్ని అందించే ....
అవసరమైన వ్యాయామ క్రీడ !
నడవాలి ...నడవాలి ...
నడవాలి..'నికో ...'
నడకతో ప్రపంచానికి
నువ్వొక మాదిరి మోడల్ కావాలి !!
***
(ఫొటోలో...అక్క ఆన్షీ...తమ్ముడు..నివిన్(నికో)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి