న్యాయములు -696
వ్యభిచారిణీ న్యాయము
*****
వ్యభిచారిణీ అనగా తప్పుగా చరించు స్త్రీ అని అర్థము.
వ్యభిచారము చేసి జీవించే స్త్రీలను వేశ్యలు అంటారు. వీరిలో చాలా మంది స్త్రీలు పేదరికం,ఆకలి తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో బలవంతంగా ఇందులోకి వస్తే మరికొందరు కొన్ని ముఠాలు ఉద్యోగం పేరుతో అమాయక బాలికలను నిర్బంధించి వ్యభిచార కూపంలోకి నెట్టి వేయడంతో వ్యభిచారిణులుగా మార్చబడుతున్నారు.
వారికి సామాన్య స్త్రీల వలె జీవితాన్ని గడపాలని ఉన్నప్పటికీ ,సమాజంలో వారిని చూసే చిన్న చూపు వలన జీవితమంతా చాలా దైన్యమైన స్థితిలో బతకవలసి వస్తోంది.
రాజులు, చక్రవర్తుల తమ భోగవిలాసాల కోసం వేశ్యలను పోషించడమనేది చరిత్ర చదివితే తెలుస్తుంది.
ఇక గురజాడ అప్పారావు గారు రచించిన కన్యాశుల్కం నాటకంలో వేశ్యయైన మధుర వాణిని ఎంతో ఉన్నతంగా, ఉదాత్తంగా మలచడం విశేషం.
వ్యభిచారము చేయు స్త్రీ తప్పనిసరై, గత్యంతరం లేక తాను ఆపని చేస్తున్నప్పటికీ తనకు ఇష్టమైన వ్యక్తిని మదిలో నిరంతరం స్మరిస్తూ ఆ ధ్యాసలో ఉంటుందని అర్థముతో ఈ "వ్యభిచారిణీ న్యాయము" చెప్పబడింది.
మధుర వాణిని గురించి చెప్పాలంటే... వేశ్యకు కూడా మనసు,మానవత ఉంటాయని ఆమె పాత్రను మనసున్న మనిషిగా ఎంతో గొప్పగా మధురవాణిని మలుస్తారు రచయిత.
అయితే కాళ్ళకూరి నారాయణ రావు రచించిన చింతామణి నాటకం వేశ్యా వృత్తి అనే దురాచారాన్ని ఖండించే నాటకం. ఇందులో చింతామణి శ్రీకృష్ణుడి యొక్క గొప్ప భక్తురాలు.ఆనాటి స్థితిగతులను అధ్యయనం చేసి రాసిన నాటకం అది.
ఇక అసలు విషయానికి వద్దాం.
వ్యభిచారిణీ న్యాయము" పేరు చదవగానే ఇదేమి న్యాయము దీనిని కూడా ఓ న్యాయముగా చెప్పాలా ?అనే సందేహముతో పాటు కొంత యిబ్బంది మనసులో మెదులుతుంది.కానీ మన పెద్దవాళ్ళ దృష్టి, ఆలోచనా విధానం గొప్పది. ప్రతి దానిని జీవితానికి అన్వయించి ఎలా ఉండాలో, ఉండకూడదో హెచ్చరిస్తూ వుంటారు.
అలాగే ఈ న్యాయమును వారు ఏ దృష్టితో చూశారో చూద్దాం.
భగవంతునికి అర్పించిన మనసు గల లేదా చిత్తవృత్తి గల మహనీయులు లేదా భగవద్భక్తులు నిత్య జీవితంలో ఏ కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ వారి మనసు మాత్రం సదా పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మ యొక్క చింతన చేస్తూ వుంటుంది.అలా మనసులో ఇష్టమైన దైవాన్ని ధ్యానిస్తూ బ్రహ్మానందం అనుభవిస్తూ వుంటారు.
వ్యభిచారి అయినంత మాత్రాన ఆమెను నీచంగా వర్ణించాల్సిన, చూడాల్సిన అవసరం లేదని, ఆమెకూ ఓ మనసనేది వుంటుందని, ఇష్టాఇష్టాలు ఉంటాయని, తనకు ఏది ఇష్టమో దానిని భౌతికంగా ఎలాంటి పనులు నిర్వర్తించినా అంతరంగమందు మాత్రం నిరంతరం ధ్యానిస్తూ వుంటుందని చెప్పారు.
అలాగే అత్యంత భక్తి గల భక్తులు తాము తమ వ్యక్తిగత, వృత్తి పరమైన, సాంఘిక, సామాజిక పనులు ఎన్నింటిని చేస్తూ వున్నా అంతరంగంలో మాత్రం ఎల్లప్పుడూ దైవాన్ని కొలుస్తూ వుంటారని చెప్పారు.
మరి ఈ రెండింటి ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మన మనసు మన సొంతం. దానిని ఇష్టదైవానికి పూర్తిగా అర్పణ చేసిన తర్వాత బయట, అంతర్గతంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనసు మాత్రం దైవ సన్నిధిలో ఉండాలని మన పెద్దలు చెబుతుంటారు. ఇక మరో కోణం ఏమిటంటే కేవలం దైవ భక్తి అనేది ఒక్కటే కాదు మనం చేయాల్సిన మంచి పనుల విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించాలి. నాతో ఏకీభవిస్తారు కదూ!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి