స్నానమయ్యేనోలేదో,
వడి..వడిగా ....
ఉతికినదుస్తులు ధరించి,
మత్తుకళ్లతో -
అటుఇటు తిరుగుతాడు!
అమ్మమ్మచేతిలో
పాలసీసా చూసి ..
నవ్వుకుంటూ
పరుగుపరుగున వచ్చి
తాతవడిని చేరిపోతాడు ...!
తాతజోలపాట వింటూ
కమ్మని పాలుత్రాగుతూ,
తాతవడిలోనే...
నిద్ర కౌగిలి చేరతాడు!
తాతకేలఇంత-
ప్రాధాన్యమిచ్చునో
ముద్దుల--
నామనుమడు 'నికో '
నిండుకుండ.....!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి