న్యాయములు-685
వృక్ష ప్రకంపన న్యాయము
*****
వృక్ష అనగా తరువు,చెట్టు,భూరుహము. ప్రకంపన అనగా పెను గాలి, వణుకు,కదులు అనే అర్థాలు ఉన్నాయి.
"చెట్టును పట్టుకొని మొదట్లో అటూ ఇటూ ఊపితే చెట్టంతా కదిలినట్లు అనిపించుట"
దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన మరియు ఆధ్యాత్మిక పరమైన కథ ఒకటి ఉంది.అదేమిటో చూద్దామా...
కొందరు వ్యక్తులు దారిలో వెళుతూ ఓ చెట్టు దగ్గర ఆగారు. అందులో ఓ వ్యక్తిని చెట్టెక్కమనగానే చెట్టు ఎక్కుతాడు. ఆ తర్వాత ఓ కొమ్మను కదల్చమని చెప్పారు. అతడు కదల్చడం ఆపకముందే కింద ఉన్న ఒక్కొక్కరు ఒక్కో కొమ్మను కదల్చమని చెప్పారు. అలా వారు చెప్పినట్లు కొమ్మ కొమ్మను కదల్చుతాడు.అలా పైన ఉన్న వ్యక్తి ఒక్కో కొమ్మను ఊపమనీ కింది అడిగారు.
అలా ఊపిన కొమ్మ మాత్రమే కదులుతుంది. కానీ చెట్టు మొత్తం కదలదు. అయితే వారికి చెట్టంతా ఒకసారి కదిలితే బాగు కానీ ఎలా? అనే కోరిక కలిగింది.
మొదట కొమ్మ కదులుతూ ఉంటే మొత్తం కదిలింది అనుకుంటారు.ఆ తర్వాత అర్థమై పోతుంది.కానీ వాళ్ళలో వాళ్ళే ఏమి చేయాలో తోచక కలవర పడుతూ వుంటారు.
దారిలో వెళుతూ ఉన్న ఒక వ్యక్తి ఇదంతా చూస్తాడు. వారి బాధను అర్థం చేసుకుంటాడు. వెంటనే చెట్టు ఎక్కిన వ్యక్తిని కిందికి రమ్మని అంటాడు.అతడు వచ్చిన తర్వాత చెట్టు మ్రానును అందరూ కలిసి శక్తి కొద్దీ ఊపమనీ చెబుతాడు.ఆ వ్యక్తి చెప్పినట్లు అంతా కలిసి మొదట్లో బలంగా ఊపుతారు. అలా ఊపడంతో చెట్టు కాండమంతయూ కదిలిపోయింది. అప్పుడు ఆ భక్తులకు ఆనందం తృప్తి కలిగాయి.
అనగా మనం ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే వారి ఉద్దేశంలో ఇతర వ్యక్తి ఊపిన చెట్టు యొక్క కొమ్మ అంత వరకే ఊగింది. ఆ ఊపిన వ్యక్తి చెట్టంతా కదిలినట్లు భ్రమ పడి అదే నిజం అనుకున్నాడు.అది నిజం కాదని మిగిలిన వారి మాటల ద్వారా తెలుసుకున్నాడు. అంతా కలిసి కదిల్చినప్పుడు మాత్రమే చెట్టంతా కదిలిందని అర్థం అవుతుంది.
ఇలా చెట్టు కొమ్మలన్నీ వివిధ అభిప్రాయాలు, నమ్మకాలు,మంత్రాల, మతాల లాంటివి. ఇలా ఎవరి తీరున వారు తమవైన నమ్మకాలతో దైవారాధన చేయడం లాంటిది.
అందులో తెలుసుకోవాల్సిన అంతరార్థం ఏమిటంటే అన్ని శాఖలుగా విస్తరించిన వాడు ఒకే ఒక్కడు.అతడే సర్వాంతర్యామి. అని గ్రహించి నట్లయితే, అలా గ్రహించి కలిసి మెలిసి వృక్ష ప్రకంపన చేసినట్లయితే అంతా ఒకటే అనే భావన కలిగి నట్లయితే సమస్త దేవతలు,మతాల సారాంశం ఒక్కటే అని గ్రహించవచ్చు.
ఈ "వృక్ష ప్రకంపన న్యాయము"లో మూల కాండం లేదా మ్రాను వలె దాగివున్న అసలు విషయం అదే. అది గ్రహించి ఇతర మతాలు,కులాల పట్ల సమరస భావన పెంపొందించుకోవాలి. అప్పుడే కులమతాల సామరస్యంతో, ఐక్యంగా ఉండి సమాజం కళకళలాడుతుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి