తెలుగుజాతి ఔన్నత్యం
తెలుగు భాష అందచందాలు
తెలుగు భాషామతల్లిపై భక్తిశ్రద్ధలు
మనం ప్రకటించుకోవాలి
సుప్త చైతన్యంలో సజీవంగా ప్రవహించే
తెలుగుతనాన్ని
మన తెలుగుజాతి జాగృతంచేయాలి!
అపారమైన స్వరాష్ట్ర భక్తిని
అఖండమైన స్వభాషానురక్తిని
అప్రతిహతమైన జాత్యభిమానాన్ని
సుందరంగా సుమధురంగా
రచనల్లో వెలయించాలి !
ఇవన్నీ
ప్రవిమల కవిగంభీర
ధీరమానస సంఫుల్ల
సురభిళ దివ్య కుసుమాలు!
ఇవన్నీ
వాసివిడని వన్నెచెడని
తెలుగు సంప్రదాయాలు!
ఇవన్నీ
మనకు తోడునీడై
శక్తిని ఉజ్జీవింపజేయగల
సురసుందర పారిజాత సౌగంధికాలు!
అలాంటి మన తెలుగుదనమే
మన తెలుగు సంస్కృతి!!
*************************************
తెలుగు సంస్కృతి: - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి