చలి వాకిలి :- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
మౌనంగా మంద్రంగా కాలం
నెమ్మదినెమ్మదిగా 
మంచు కొలిమి నయగారం 

చలి
దండెత్తని పులి కాదు
ఆకలిగొన్నది ఆవురావురంటూ నీపైకి 

గాలి బంధించిన తిత్తుల
గిత్తల నడకలు  
హిమజ్వాల బందీ 
ముక్కులు ఆడని నత్తల కదలికల 

ఎముకలు కొరికే చలి ప్రేమ
మంచు వాకిలి
మండే నెగళ్ళు వేడి సెగల కౌగిట జవరాలు

కర్త కర్మ క్రియలన్నీ చలిచలి
తనైన ఈ రోజులు వచన కవితల గిలి
ఇసుక జవరాలి వాక్యం చెలి కొంగైన గొంగడి 


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Wonderful description of feeling of cold season and its effects on bones, muscles, sense organs and mind as a whole. Besides that, desctiption of surroundings and the love for blanket seem exemplary. Congrats to the poet