బంగారుకొండ ...!: -- డా.కె.ఎల్.వి.ప్రసాద్.
 అమ్మమ్మకు 
'అమ్మూ ..' అని 
ముద్దుపేరుపెట్టింది  
నికో అక్క 'ఆన్షి ' !
నీకో కూడా 
అమ్మమ్మను -
' అమ్మూ ..'అని 
ముద్దుగ పిలుస్తాడు !
ముందు -
పలకడం నేర్చుకున్నాడు
ఇప్పుడు ...
పిలవడం మొదలెట్టాడు!
తాతకు --అమ్మమ్మకు 
ప్రేమను -
సమానంగా పంచుతాడు ,
అవసరాన్నిబట్టి ...
రూటు మారుస్తుంటాడు !
మా మనవడు,నికో -బాబు 
బంగారుకొండ ....
మాలో ..నిత్య చైతన్యానికి 
వాడే మరి -
మాకు పెద్ద అండదండ ...!!
                    ***

కామెంట్‌లు