.పటేల్జీ;- కోరాడ నరసింహా రావు !

 పటేల్జీ...నిజంగానే మీరు ఉక్కుమనిషి!
   వృత్తి కర్తవ్య దీక్షలో భార్యమరణము చలింపజేయలేక పోయె!
   వంచనతో దూరమైన ప్రధాని పదవి మిము చలింపజేయలేకపోయే...!
     సమైక్యభారత్కు ,
ప్రతిబంధకమైన స్వదేశీ సంస్థానాల తిరుగుబాటు మిమ్ము చలింప జేయలేదు!!
    ఎదురైన క్లిష్ట సమస్యలన్నింటినీ...
   ఆత్మ స్థైర్యంతో ఎదుర్కుని...
  ఉక్కుమనిషి బిరుదుకు, సార్థకత చేకూర్చి నారు !
 జోహార్... సర్దార్ జోహార్ 
💐🙏🌷💐..

కామెంట్‌లు