ఓ విద్యార్ధి...! : -కోరాడ నరసింహా రావు !
ఓ విద్యార్ధి...! 
  విద్యను అర్ధించ వచ్చిన
     విద్యార్ధివి నీవు... 
    గురువు పట్ల చూపవలెను
       వినయము, విధేయత! 

బుద్దిగ నువు చద వాలి
    శ్రద్ద నెంతో చూపాలి
     సమయ పాలన కావాలి
       క్రమ శి క్ష ణ గుండాలి ! 

చదువులలో ఆసక్తి
   గ్రంధాలయ అను రక్తి
     మంచి-మంచిస్నేహితులు
       సేవా కార్య క్రమాలు..! 

ఉత్తమ విద్యార్ధులుగా
   పేరు తెచ్చు కోవాలి 
     గొప్పవారిగా ఎదగాలి
       కన్నవారికి, ఉన్నవూరికీ
        మంచి పేరును తేవాలి
         భావితరానికి మీరే  ఆదర్శ0 కావాలి ! 
         *******


కామెంట్‌లు