నేను బస్సెక్కి
కిటికీ పక్కనే కూర్చున్నా
బస్సు కదిలింది
నా మనస్సూ కదిలింది
కిటికీ పక్కనే కూర్చున్నా కదూ
దృశ్యాలు దృశ్యాలుగా
దృశ్యాలు పరుగు పెడుతున్నాయి
అదేం ఆశ్చర్యమో
అవన్నీ వెనక్కు పరుగెడుతున్నాయి
వాటికేం పనో?
కాసేపు నాకు అర్థం కాలేదు
ఆ దృశ్యాలన్నీ వెనక్కు పరుగెడుతున్నాయా?
లేక….,
నేనే ముందుకెళుతున్నానా?
ఏమయితేనేంలే
ఆ దృశ్యాలు నా మనో యవనికపై
ముద్రితాలౌతున్నాయి
వాటిని చూస్తూ
ఆనందం నా గుండె గూట్లోకి
ఇంకుతోంది
ఆనందో ప్రయాణం!!
**************************************
ప్రయాణం ::- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి