సుప్రభాత కవిత :- బృంద
అందం మోస్తూ వచ్చే 
ఆనందమే నీవా
ఇలకు దిగివచ్చే ఇంపైన 
ఇనుడి అనుగ్రహం నీవా?

ఈశ్వరేచ్ఛగా తెచ్చిన
ఈప్సితార్థము నీవా?
ఉరకలేసే ఉత్సాహపు 
ఊయాలుపే  ఉత్తేజం నీవా?

ఋతువులతో  పుడమి
రూపు రేఖలు మార్చి 
ఎప్పుడు ఏది అవసరమో
ఏమరక అమర్చే అమ్మవు నీవా?

ఐదు భూతాలను అదుపుచేసి 
ఒడుపుగా ఒక్కతాటిన నడిపి
ఓర్పుగా ఉర్విని కాపాడి 
ఔరా అనిపించే రౌతువు  నీవా?

అహంకారమెంత చూపినా 
అంతులేని ఆశీస్సులతో 
అవనీ జనులందరినీ 
అహరహమూ కాచే తండ్రివి నీవా?

అన్నీ తానైన అంతర్యామికి 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు