నిన్నని ఫలమేమిటే ఓ చెలీ!
చిరునవ్వు లొలికించి, మదినే కవ్వించి
అంతలోనే ఇటుఅటు చూచి మటుమాయమై పోదువే
ఆ వింతలుగని నా మనసేమో కవ్వింతలు కాగా
ఎందుకు ఎందుకు నా మది బేలగ మారెనో
!!నిన్నని!!
చిరుగాలి రిమరిమలు నీరాక తెలిపేను
ఆకుల గలగలు నీ పదధ్వనులే వినిపించేను
ఆ వింతలుగని నామనసేమో కవ్వింతలుకాగా
!!నిన్నని!!
కోకిల కిలకిల ధ్వనులలో నీ గళమేదాగె
నా కనులందు నీ ప్రతిరూపమే నిశ్చయముగ నిలిచే
ఆ వింతలుగని నా మనసేమో కవ్వింతలు కాగా
!!నిన్నని!!
నా మది నిరతము నీ ధ్యానము చేసెను బేలయై
నా మదిలోనీ భావాలన్నీ వెడలెను కవితా రూపమై
ఆ వింతలుగని నా మనసేమో కవ్వింతలు కాగా
!!నిన్నని!!
**************************************
ఓ చెలీ!:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి