తీరని దుఃఖంతో
భుజంమీద వాలిన తలపై చేయి-
తెగని అవసరానికి
తగిన సహకారం-
అవమానపడిన గుండెను
గడపలోకి చేర్చుకున్న అండ -
ఓటమి దిగాలుకు
వీపుతట్టి ధైర్యం అద్దిన స్పర్శ-
తగ్గని రోగానికి
మాటల నయం-
రాలుతున్న ఆశ్రువులకు
వేలికోసల తుడుపు-
ఓదార్పు ఓ విధ్వంసాన్ని ఆపుతుంది
ఓ విపత్తును దాటిస్తుంది
ఓ కొత్త దారిని తెరుస్తుంది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి