నింగి నేతెంచు ఆరంజ్యోతికి
కొమ్మల కర్పూర నీరాజనాలు
చల్లగాలి వింజామరలు
గుండె సడులే గంటానాదాలు
స్వచ్ఛమైన మనసుతో
పచ్చటి పచ్చిక ప్రార్ధనలకు
వెచ్చని కిరణాల దీవెనలతో
మెచ్చి వరమిచ్చిన వేలుపు
తూర్పున మొదలిడి సాగే
వెలుగుల రథ ప్రస్థానము
పడమటికి చేరువరకు
పుడమికి కాంతుల వరమే!
భానుడి కాంతి పుంజపు
భాసుర ప్రకాశ ప్రభావము
నారింజ రంగులద్ది నింగిని
రంగస్థలముగ ఆవిష్కరించె!
కాంతిసాగర మధ్యమున
బింబోదయ దృశ్య వీక్షణం
అవనికి శాంతి సౌఖ్యములిచ్చు
అద్భుత అనుగ్రహ పారవశ్యం
తరలి వచ్చిన తరళాత్మునికి
తలిరు హృదయాల స్వాగతం
తపముని ఆగమన సంభ్రమం
తనివి తీరని అనుపమ సంబరం
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి