నవ్వుతూ బ్రతకాలిరా -- 13:-సి.హెచ్.ప్రతాప్
 (1) “ ప్రముఖ సినిమా స్టార్ ను ఏరి కోరి పెళ్ళి చేసుకున్నావు కదా ! కంగ్రాచులేషన్స్. ఇంతకీ మీ హానీమూన్ ట్రిప్ ఎలా జరిగింది “ కొత్తగా పెళ్ళయిన స్వప్నను ఆసక్తిగా అడిగింది అమల.
“ చాలా బాగా జరిగింది. లాస్ట్ మేమెంట్ లో షూటింగ్ వుండడం వలన ఆయన తన డూప్ ను నాతో హానీమూన్ కు పంపించారు.చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది.”అసలు సంగతి చెప్పింది స్వప్న.
(2)"సార్ !, మీరు అధికారం లోకి రాగానే రాష్ట్రం లో దోమలను సమూలం గా నాశనం చెస్తానని ఎన్నికల ప్రచారం లో వాగ్దానం చేసారు కదా , ఈ విషయం లో మీరు చేపట్టిన చర్యలను గూర్చి కాస్త వివరిస్తారా ? " ఆరోగ్య శాఖా మంత్రివర్యులను అడిగాడు పత్రికా విలేఖరి.
" ఆరోగ్య శాఖా మంత్రి కింద పదవి చేపట్టిన మూడు నెలల కాలం లోనే రాష్ట్రం లో మూడు దోమల మందు తయారు చేసే ఫ్యాక్టరీలను నేను స్వంతం గా నెలకొల్పాను.ప్రజలు వాటిని కొనుకొన్ని హాయిగా దోమల బెడదను వదిలించుకోవచ్చు" గర్వం గా చెప్పారు ఆరోగ్య శాఖా మంత్రివర్యులు.
(3)"ఏమోయ్ సర్వరూ, ఒక ప్లేటు భోజనం తీసుకురా !" ఆర్దరు వేసాడు సత్యనారాయణ.
"ఆర్డినరియా, స్పెషలా ?" అడిగాడు సర్వర్ సుందరం.
"ఏమిటి వాటి మధ్య తేడా ?" అడిగాడు సత్యనారాయణ.
"స్పెషల్ అయితే ముందు తిన్నవారి ప్లేట్లను సర్ఫ్ పౌడర్ తో కడుగుతాం, ఆర్డినరీ అంటే కొంచెం నీళ్ళతో కడిగేసి వదిలేస్తాం" అసలు సంగతి చెప్పాడు సర్వర్ సుందరం.
(4)“పాశ్చాత్య సంస్కృతిని ఒంట పట్టించుకున్న ఒక ఇరవై అయిదేళ్ళ అందాల భామ ఒక కంపెనీలో సెక్రెటరీ పోస్టుకు అప్లయి చేసింది. పేరు, వయస్సు,విద్యార్హత,జాతీయత వగైరా వివరాలను అప్లికేషనులో పూర్తిచేసాక “సెక్స్” అనే కాలం వద్ద ఆగిపోయింది. ఒకటి, రెండు నిమిషాలు సిగ్గుపడి చివరకు”వారానికి మూడు సార్లు మాత్రమే” అని రాసింది.

కామెంట్‌లు