నవ్వుతూ బతకాలిరా -- 14 :-సి.హెచ్.ప్రతాప్
 (1)“ఏమిటండీ, మన పెళ్ళి రోజున నల్ల ఫ్యాంటు, నల్ల షర్టు వేసుకున్నారు?” ఆశ్చర్యంగా అడిగింది భార్య.
“జాతీయ విపతులు జరిగిన రోజున నల్ల బట్టలు ధరించడం మన రివాజు” అసలు సంగతి చెప్పాడు భర్త.
(2)“ఏమిటండీ కారు అంత స్పీడుగా డ్రైవ్ చేస్తున్నారు? ఇంటికి వెళ్ళడానికి ఎవరో తరుముకొస్తునట్టు ఎందుకంత తొందర ?” అడిగింది భార్య.
“ అదేం కాదు! కారు బ్రేకులు ఫెయిలయ్యాయి. యాక్సిడెంట్ జరిగే లోపల ఇల్లు చేరుకుందామని స్పీడుగా పోనిస్తున్నాను” అసలు సంగతి చెప్పాడు భర్త,
(3)“ నేను ఈ రోజు నుండి నీ దగ్గర ఏమీ దాచదలచుకోలేదు. ఫ్రాంక్ గా అన్నీ నిజాలనే చెప్పెస్తాను. నేను ముద్దు పెట్టుకున్న మొదటి అమ్మాయివి నువ్వు మాత్రం కాదు” శొభనం రోజున భార్యతో ఆవేశంగా చెప్పాడు రాజేష్.
“మీ ఫ్రాంక్ నెస్ నాకు నచ్చింది. నేనూ ఈ రోజు నుండి మీ దగ్గర అన్నీ నిజాలే చెబుతాను. మీకు అమ్మాయిలను ముద్దు పెట్టుకోవడం రాదు” తాపీగా చెప్పింది శొభన.
(4).టీచర్ :” టి తో మొదలయ్యే రెండు ఇంగ్లీష్ వారాల పేర్లు చెప్పరా రాము”
రాము : “ టుడే మరియు టుమారో”
టీచర్ “ ????”  

కామెంట్‌లు