గలగల పరుగు గోదావరి ఊరు మసక జలకళ
పనిపాట పుడమి మిలమిల తార పొరల చీకటి
నాటి శోభల ఊరు కనిపించని విచిత్రం వింత
మితిమీర కోరిక మనసు పరుగుల ఊరు
ప్రపంచీకరణ నీడల నడక కాలం అంచుల
కొత్త హంగుల కొత్త రంగుల నగర వలస ఊరు
పదనిసల నటనల పట్నం సుందరి అడుగులు
వయారి మయూరి నగరభ్రమలో వేషం పల్లీయం
ఆకర్షణల యవ్వనజవ్వని మోహ వల్ల ఊరు
ఉండలేక ఆడ వీల్లే ఊరు మనిషి ఆటే మథనం
మమత విడిచి పల్లె వదిలి బతుకు పట్నవాసం
గానుగ బతుకు నగరంలో పరుగు రద్దీ తడబాటు
చదువుకో భుక్తికో బయల్దేరిన మనిషి నగరవాకిట
నవ్వు ప్లాస్టిక్ ఎద మల్లె ప్లాస్టిక్ మేకప్ సిటీ లైఫ్
మనిషితో మనిషి మాటే కరువైన నగర దారి
కలిస్తే మాట కదిల్తే ఆట మనసు విస్తృతి ఊరు
దారి ఇరుకు బతుకు బెరుకు నమ్మికలేని పట్నం
అవసర పాఠమే నగరి అసలు బతుకే ఊరుగిరి
ఉద్యోగ పర్వం బదిలీల కాండ పట్నలీల
గదిపైన కప్పున్న సొంత ఇల్లువాకిలి నిల్
ఆగమాగం చీకటి వెలుగుల కళ నగరం
=============================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి