డాక్టర్ అమిత్సింగ్ యాదవ్ కిసౌరశక్తిపై ఆసక్తి శ్రద్ధ. తన క్లినిక్ పై12 కిలోవాట్ల సోలార్ సిస్టం పెట్టించి 15 వేలు ఆదా చేయగల్గుతున్నాడు.తన బంజరుభూమిలో పి.ఎం. కుసుమ్ పథకంద్వారా కరెంట్ ఉత్పత్తి తో ఆరులక్షల ఆదాయం నెలకు పొందుతున్నాడు.రాజస్థాన్ కి చెందిన ఇతను మార్గదర్శిగా వెలిగాడు.పెట్టుబడి మూడున్నరకోట్లు. బంజరుభూమికి లాభాల పంట.
అడవి జంతువుల వల్ల పంట నాశనం అవుతోంది అని లబోదిబో అంటున్న రైతుల పాలిట దేవుడు అయాన్.ఏఐతో నడిచే రైతుల తయారుచేసే సంస్థ లో జాబ్ చేస్తూ రైతుల కష్టాలు తెలుసుకుని ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో"కాటిథాన్" అనే పరికరం తయారుచేశాడు.సోలార్ కరెంట్తో నడుస్తుంది.మిరుమిట్లు గొలిపేలా వెలుగులు చిమ్మి జంతువులను భయపెడ్తుంది. కపికాట్ అనే యంత్రం వింత శబ్దాలు చేస్తూ పిట్టలు కోతుల్ని బెదిరిపోయేలా చేస్తుంది.అయాన్ కృషితో రైతుల బాధలు తీరాయనే చెప్పొచ్చు.చెన్నైలో ప్రతిపార్కులో ఉచితంగా పుస్తకాలు ఇచ్చి చదువుపై ఆసక్తి పెంచుతున్నారు.ఈడుకు జోన్ లో తమిళ ఆంగ్ల ఆధునిక సాహిత్య పరిచయంచేస్తున్నారు కార్పొరేషన్ అధికారులు🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి