కేరళవాసి సి.కె.అలెగ్జాండర్ 60 ఏళ్లుగా రేడియోశ్రోతగా ఉదయం 5.30_రాత్రి 9.30దాకా అన్ని కార్యక్రమాలు వింటూ 40ఏళ్లుగా ఆకాశవాణికి లేఖలురాస్తూ " శ్రవణశ్రీ" అవార్డును అందుకున్నారు 20 సార్లు.కేరళలో ఆకాశవాణి ప్రారంభమైన తొలిరోజునుంచే వింటున్న ఆయన చేత పలుకార్యక్రమాలు రేడియోవారు చేయించడం ఓవిశేషం! ఇలా తన 90వ ఏటదాకా రేడియోతో గడిపిన కీ.శే.కోవూరి యాదగిరిరావుగారు( షాద్ నగర్) హైదరాబాద్ ఆకాశవాణి ఉద్యోగులందరికీ సుపరిచితులు.ఆయన ఉర్దూ మీడియం ఆపై ఆంగ్లంలో ఎం.ఎ.బి.ఇడి.చేసి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఆనాటి ఎన్.టి.ఆర్.ముఖ్య మంత్రి చేతులమీదుగా అవార్డు అందుకున్నారు.ప్రధానోపాధ్యాయునిగా వెయ్యిపైగా పిల్లల ప్రోగ్రాములు స్త్రీల చేత మహిళామండలి రేడియోప్రోగ్రాంలు చేయించిన ఘనత ఆయనది.స్వయంగా వ్యవసాయంచేసి రైతులకు అండదండగా నిలిచారు.కానీ ఏపేపర్ ఆయననిగూర్చి రాయలేదు.అందుకే ఆయన ని గూర్చిన నాలుగుమాటలు రాశాను.
మనం చెరువులు కలుషితం అవుతున్నాయని గగ్గోలు పెడుతున్నాం.హడావిడి ఎక్కువ చేతలు శూన్యం.కానీ థాయిలాండ్ తైవాన్ చైనా మొదలైన దేశాల్లో బాతులను పెంచుతూ డక్ ఆర్మీ పేరుతో వరిపొలాల్లో వదులుతారు. అవి పొలానికి హాని చేసే పురుగులనుతినటంతో రసాయన మందులు వాడే అవసరంలేదు. ఇలాంటివి మనం చేపట్టవచ్చుగదా?రోజూ మగపిల్లలు బస్సులో వేలాడుతూ ప్రమాద కరంగా ప్రయాణాలు చేస్తున్నారు.ప్రాణాలుపోతున్నా పరిష్కారం ఆలోచించని గొప్ప వారంమనం. కానీ తమిళనాడు ప్రభుత్వం మెట్రోరైలు తరహాలో బస్సులకు డోర్స్ పెట్టించింది.బస్టాప్ లో తలుపులు వాటంతటవే తెరుచుకు మూసుకోటంతో అబ్బాయిలకు ప్రమాదాల ముప్పు తగ్గింది.🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి