స్ఫూర్తిప్రదాతలు 74 సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 తమిళనాడులోని అరిట్టపట్టి అనే పల్లెలో 90ఏళ్ల వీరమ్మాళ్ గ్రామ సర్పంచ్ గా చేస్తున్న పనులేంటో తెలుసా? రోడ్లు నీరు మరుగుదొడ్లు శుభ్రత తోపాటు ప్రజల సమస్యలు తెల్సుకుంటుంది.పరిష్కరిస్తుంది. 
మనసుకి వయసుతో పనేముంది చెప్పండి?
ఐ.సి.ఎస్.అధికారి రవీంద్ర మిశ్ర బేడియా అనే గిరిజన తెగ తలరాతనే మార్చారు.ఒకప్పుడు నాట్యకళాకారులు.కానీ ఆడవారంతా వ్యభిచారంతో కుటుంబ పోషణ చేసేదుస్థితి. వారితలరాతలు మార్చి భోపాల్ లో బడిలో చేర్పించాడాయన.సంవేదన అనే ఎం.జి.వో.ద్వారా 100మంది డిగ్రీలు పొందారు.ఐక్య రాజ్య సమితి ఆహ్వానంపై ఆయన కొసావో బోస్నియా దేశాల్లో పడుపువృత్తికి తిలోదకాలిప్పించి విద్యావంతులుగా తీర్చిదిద్దారు.స్వచ్ఛభారత్ కోసం కంకణంకట్టారు ఉత్తరాఖండ్ వాసి ఇంజనీర్ భువన్ రావత్. స్వచ్ఛ ఉత్తరాఖండ్ పేరుతో చెత్త డబ్బాలు ఏర్పాటుచేశారు.ఖాళీటిన్ క్యాన్లు అట్ట పెట్టెలు డస్ట్ బిన్స్ గా వాడమని చిప్ కో ఉద్యమంనడిపిన గౌరాదేవిని గూర్చి వివరించి వారిలో జోష్ హోష్ పెంపొందించారు. ఎవరింట్లో ఫంక్షన్ జరిగినా డస్ట్ బిన్స్ కానుక గా ఇవ్వటం అలవాటుచేశారు.బడిపిల్లలచేత కార్డ్ బోర్డ్ తో డస్ట్ బిన్స్ తయారుచేయిస్తారు🌹
కామెంట్‌లు