మానవ జీవన వేదం - భగవద్గీత ( వచన కవిత్వం ):- " కావ్యసుధ "9247313488 హైదరాబాదు.
 గీత మానవ జీవన 
సరళిని నియంత్రిస్తూ....
జీవన గమనానికి సత్యమైన 
చేరువైన గమ్యాన్ని..... చూపుతుంది.
అర్థం చేసుకోవడానికి                                             
 ప్రయత్నించే కొద్దీ 
నిత్య వ్యవహారిక జీవితంలోని 
అనేక సమస్యలకు....                            
 సమాధానాలు 
పరిష్కారాలు....గోచరిస్తాయి.
అందుకే గీతామృతం అన్నారు.
ఈశ్వరార్పణబుద్ధితో 
చేసే కర్మలు తప్ప
మిగతా కర్మలన్నీ 
బంధానికి కారణమవుతాయని 
తెలిసి ఆచరించడమే
మోక్షానికి మార్గ మైనది గీత
శుద్ధ సంపూర్ణ జ్ఞానమూర్తి 
శ్రీకృష్ణుడు అర్జునునికి 
నిమిత్త మాత్రునిగా బోధించిన                            
నీతి శాస్త్రం భగవద్గీత.
భగవద్గీత ఒక మత గ్రంథం కాదు
సమస్త మానవాళికి జీవనవేదం
ప్రకృతిలో ఉంటూనే 
ప్రకృతికి అతీతంగా..
ఎలా జీవించవచ్చు
నేర్పింది గీత.
యోగమంటే చేసే సత్కర్మను                            
 నేర్పుతో చేయడమే !
కొత్త నిర్వచనం చెప్పింది గీత.
కర్మ చేయడం మన వంతు
ఫలాన్ని కోరకుండా కర్మ చేస్తే                            
అది నిష్కర్మ అవుతుంది.
భగవంతుడు నచ్చే 
కర్మ విధానం అదే !
ఈ సిద్ధాంతాన్ని                            
ప్రతిపాదించింది గీత.
అలాంటి గీతను 
శ్రవణం చేయాలి.
మననం చేయాలి. 
ధ్యానం చేయాలి.
ఆధునిక జీవిత.......
సంఘర్షణలతో                                                         
నలిగిపోన్నా యువతకు                                                        
భగవద్గీత చక్కటి కరదీపిక.
మానసిక ప్రశాంతతను                             
 కలిగించే ఆదర్శ గ్రంథం గీత.
జీవిత ధర్మంగా కర్మను                            
 ఆచరించడం ఎలాగో.
నేర్పే గొప్ప ప్రణాళిక భగవద్గీత.
మానవులకు భగవద్గీత                              
కల్పవృక్షం లాంటిది.
దైవత్వానికి చేర్చే ఆధ్యాత్మిక                              
మతాన్ని గీత స్థాపించింది.
నిర్మల.....నిచ్చల........
జ్ఞానభక్తి ఏర్పడుతుంది
ఇదే గీత సారం ! 
నిష్కామ కర్మే ఆరాధన. 
ఇదే గీత హృదయం.

కామెంట్‌లు