ఎవరో ఎవరో ఎవరో
కలలో కనిపించిందెవరో
తెలియక మది పడే తికమక
తెలిశాక అది పడే మకతిక !
కనిపించినట్లి కనిపించి
అతను ఆయెను మాయం
మిగిలె నా మదికి గాయం
కాలమాయే ఇక వ్యయం !
నక్షత్రంలా నా కనుల ముందు
మెరిసి విరిసి నన్ను మురిపించే
ముగ్గులోకి దించి మైమరిపించే
సిగ్గే సింగారం అని తావివరించే !
మాయమైన నా కలల మనిషి
గాయమైన నా మనసు తెలిసి
నన్ను ఓదార్చుటకు వచ్చాడు
ప్రేమతోనీ తను బుజ్జగించాడు !
అతని లాలనలో పాలనలో నేను
తడిసి ముద్దై సిగ్గుల మొగ్గనైనాను
ఎరుపెక్కిన నా బుగ్గల తను చూసే
నువ్వే నా బంగారం అని తాఅనేసే
ముద్దు ముద్దు మాటలతో తను
సుద్దులెన్నో చెప్పి వినిపించాడు
మరుడై వరుడై ఇక కనిపించాడు
కళ్యాణం వైపు కథ నడిపించాడు !
ఆశ దోశ అప్పడం అన్నా తావినక
చెంపకు చెంప ఆనించి ప్రేమ పెంచి
నువ్వే నువ్వే నా గతివి నా సతివి
అని తాచెప్పి నన్ను బుట్టలో కప్పే !
చేసేదేమీ లేక ఇక అతనికి నేను
నా తనువును అప్పగించినాను
అగ్నిసాక్షిగా జరిగే మా పరిణయం
ఫలితంగా మాకు కలిగే సంతానం !
జరిగిన ఈ తతంగమంతా
కరిగిన నా కలలో జరిగింది
వాస్తవం కాదని ఇక తేలింది
సమస్తం వ్యర్థమై కూలింది. !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి