పూజకు వేళాయె:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్ .9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
మా పూజకు వేళాయె
ఆ స్వామియె తోడాయె
మ్రోగెనుగా జయగంట
విజయం ఇక మాదంట !

పూజ విధానం తెలిపి
పూజకు నను మలిపి
టెంకాయను కొట్టిస్తాడు
తను దీపం ముట్టిస్తాడు !

మడి కట్టుకొని నే వస్తా
గుడిలో పూజలు చేస్తా
ఆ దేవదేవుని పూజిస్తా
నా దైవం అని భావిస్తా !

మహాభారతం భాగవతంతో
సహా రామాయణం పారాయణం
 స్థానిక భక్త బృందంతో చేపిస్తాం
మేం మా భక్త కమిటీని ఒప్పిస్తాం !

ప్రవచనాలకు చోటిస్తాం
త్రికరణశుద్ధిని పాటిస్తాం
దృశ్య యంత్రం తెప్పిస్తాం
శ్రవణ మంత్రం చెప్పిస్తాం !

పాలను సమృద్ధిగా తెప్పిస్తాం
పాలాభిషేకం తప్పక జరిపిస్తాం
మా భక్తులందరిని మురిపిస్తాం
మేం భక్తితో వారిని మైమరిపిస్తాం!

యజ్ఞశిక్షణను చక్కగా ఇప్పిస్తాం
యజ్ఞ రక్షణను కూడా కల్పిస్తాం
యజ్ఞ వాటికలను ఇక నిర్మిస్తాం
యజ్ఞయాగాలను వెంటనేచేపిస్తాం 

పురాణముల మేం చెప్పిస్తాం
పుణ్యపురుషులను రప్పిస్తాం
సత్కరించి శాలువా కప్పేస్తాం
చమత్కరించి ఇక పొగిడేస్తాం !

వేద పండితులను పిలిపిస్తాం
వేద వేదములను పలికిస్తాం
పిలవగానే పలికే మా దేవుళ్ళు
తలవగానే ఔతారు మావాళ్లు !


కామెంట్‌లు