పాలెం సుబ్బయ్య:- వనపట్ల సుబ్బయ్య-9492765358
అక్షర నక్షత్రాలను తెంపి
మా జేబులు నింపిన విద్యాధాత
పాలమూరుకు 
అక్షర కిరణాన్ని తొడిగిన  మహదాత

చదువులేని  బానిస కాలం
వెట్టిచాకిరి రాజ్యమేలిన పెత్తనాల కాలంలో
స్వార్థంతో ఏ సూర్యుడు మా కోసం నడిచిరాలే
ఏ కుల చంద్రుడు మాకై గుండెను తెరువలే
మా కోసం ఎండల్లో నడిచొచ్చాడు 
మా ఊరికొచ్చాడు
మా వీధికొచ్చాడు
మా ఇంటికొచ్చాడు వెతుక్కుంటూ
కడపకడపకు అక్షర గంధాన్ని పూశాడు
ఇండియాకు లక్షల నక్షత్రాలను అందించిన మహానీయుడు

ఇక్కడ నీళ్ళులేని కరువు గోస
అక్షరం లేని చీకటి గోస
దూపైతుందంటే నీళ్ళను ఎత్తెత్తి పోసేది
చదువుకుంటమంటే
దూరముండండి దూరముండండి
మా ఊరికి పాఠశాల చదువొద్దని చెప్పేది 
పేదరికం దారిద్యాల అతివృష్టి కాలంలో 
పాఠశాల,కళాశాల, ఓరియంటల్, ప్రాచ్యకళాశాల వ్యవసాయ పాలిటెక్నిక్ 
అక్షర చెట్లను నాటిన అసామాన్యుడు
ఆ మహా వృక్షానికి కాసిన మధుర పలాలే 
నేడు యూనివర్శిటీలను నేలుతున్నయి

పరిపాలనంటే అయిదేళ్ళకోసారి ఎలక్షన్ కొన్ని సంక్షేమపలాలనుకోనే దౌర్బాగ్యంలో
తానే యూనివర్శిటై వ్యవస్థై
పాలెం గ్రామాన్ని విద్యాగ్రామంగా 
మలిచిన తపస్వీ
దేశానికి ఆద్యుడు మార్గదర్శి మహనీయుడు

భూములును సంపదలును
వారసులపేరున శాసనాలు రాయించి ఎందరో కాలగర్బాన కలుస్తారు
చదువులేకున్నా తనభూమినంతా విద్యాలయ కార్యాలయాలలకందించి స్వాతంత్య్రానంతరమే గ్రామాభివృద్దిని పారిశ్రమికంగా  మాడల్ గా నిలబెట్టి
తనే ఓచరిత్రై నిలిచారు ....

నది 
పంటపొలాలకు నీళ్ళనివ్వడమే గాకుండా 
తన దేహాన్ని వొలిచి వొండును (నల్లమట్టి) ఎరువుగా ఇచ్చినట్లు
పాలెం సుబ్బయ్య
తన యావదాస్తిని విద్యాబివృద్ధికి అంకితం చేసిన అక్షర యాన్ పాలెం సుబ్బయ్య

◆గుండోజు యాదగిరి సార్ మా గురువుగారికి ప్రేమతో....

【పాలెం విద్యాసంస్థల సృష్టికర్త
తోటపల్లి సుబ్రహ్మణ్యం జయంతి】


కామెంట్‌లు