పట్టుదల ముఖ్యము:- -గద్వాల సోమన్న,-9966414580
పట్టుదల లేకుంటే
పట్టు తప్పు జీవితము
పరాజయమే తప్పదు
సత్ఫలితాలు శూన్యము

నిర్లక్ష్యం భూతమే!
ఆవరిస్తే పతనమే!
ఘన విజయాలకు వేదిక
కష్టించే తత్వమే!

సానుకూల దృక్పథమే!
 చాలా చాలా మంచిది
దరహాసము ఔషధమే!
అనారోగ్యము మాయమే!
ముఖానికి అందమది

కష్టాల్లో సహకారము
చేతనైతే ఉపకారము
చేయు వారు మహనీయులు
అత్యంత ఆరాధ్యులు


కామెంట్‌లు