చదువే అన్నిటికి మూలం : --గద్వాల సోమన్న,9966414580
ముఖ్యమైనది చదువు
విజ్ఞానానికి నెలవు
బాగు చేయును బ్రతుకు
లాభలెన్నో కలవు

చదువు వల్లే ఘనత
జీవితాల్లో నవత
ఉన్నతంగా చదివిన
ఉండును మంచి భవిత

చదువు వలన సౌఖ్యము
దాని ద్వారా లౌక్యము
అందుకే చదవాలి
గొప్పగా ఎదగాలి

చదువులేని జీవితము
కాపులేని వృక్షము
అన్నిటికీ మూలము
అక్షరాల సత్యము


కామెంట్‌లు